ఫైనల్ గా పవన్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అలాగే గెస్ట్ రోల్ లో కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో అయితే వినోదయ సీతం రీమేక్ ని ఇటీవల కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు పవన్ కి స్వల్ప గ్యాప్ దొరికింది.

ఇక మరో పక్క అయితే పవన్ సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి షూటింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా ఇక ఈ ఏప్రిల్ 5 నుంచి పవన్ మళ్ళీ ఏక్షన్ లోకి దిగనున్నాడని బజ్ వినిపించింది. కాగా ఈ సినిమాలలో అయితే దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా తేరి కి రీమేక్ గా తెరకెక్కనుండగా ఆ మధ్య అయితే ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో కాస్త క్రేజీ టాక్ నడిచింది. యంగ్ సెన్సేషన్ శ్రీ లీల అలాగే పూజా హెగ్డే ఇద్దరు పేర్లు కూడా వినిపించగా ఇప్పుడు ఎట్టకేలకు ఓ ఫైనల్ క్లారిటీ దీనిపై సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో అయితే ఫైనల్ గా శ్రీ లీల పేరే లాక్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో సింగిల్ హీరోయిన్ శ్రీ లీల కనిపించనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కి భారీ సెట్ పనులు కంప్లీట్ అవుతుండగా పవన్ కొన్ని రోజులు ప్రస్తుతానికి డేట్స్ అందించారు.

ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆల్రెడీ కొన్ని ట్రాక్స్ తాను డిజైన్ చేసాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుంది అని టాక్.