మహానటి సినిమా కి కీర్తి సురేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఏం చేసిందో తెలుసా..?

నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కీర్తి సురేష్ నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ కావటంతో ఇక స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక కీర్తి సురేష్ తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో ఆమె నటించిన అన్ని సినిమాలో దాదాపుగా హిట్ అయ్యాయి. కీర్తి సురేష్ సినీ జీవితంలో ఆమె నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఆమె నటించిన మహానటి సినిమా మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

అలనాటి నటి మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించిందని చెప్పవచ్చు. అలనాటి హీరోయిన్లలో మహానటి అనగానే సావిత్రి పేరు గుర్తుకు వచ్చేది. ఇప్పుడు మహానటి అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. అంతలా సావిత్రి పాత్రలో లీనమై నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ఇలా మహానటి సినిమా ద్వారా మరింత ఫేమస్ అయిన కీర్తి సురేష్ ఈ సినిమా కోసం దాదాపు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే మహానటి సినిమా కోసం కీర్తి సురేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ లో సగభాగం సావిత్రి పేరిట దానధర్మాలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో నటించడం వల్ల కీర్తి సురేష్ సావిత్రికి ఉన్న గౌరవాన్ని సొంతం చేసుకుంది. అందువల్ల ఈ సినిమా ద్వారా తన సంపాదించిన డబ్బులను దాదాపు కోటి రూపాయల వరకు సావిత్రి పేరు మీదుగా అనాధ ఆశ్రమాలకు చారిటబుల్ ట్రస్టులకు దానధర్మాలు చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ చేసిన మంచి పనికి ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల మహేష్ బాబుతో కలిసి జంటగా సర్కారు వారి పాట సినిమాలో నటించి హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.