‎Keerthy Suresh: కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ మామూలుగా లేదుగా.. పోలీస్ స్టేషన్ కీ అన్ని సార్లు వెళ్ళానంటూ!

‎Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. తర్వాత తెలుగులో సర్కారు వారి పాట, దసరా, మహానటి, రెమో, రంగ్ దే, ఏజెంట్ భైరవ, నేను లోకల్, గుడ్ లక్ సఖి వంటి సినిమాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాతో భారీగా క్రేజ్ ని గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

‎ఈ సినిమాలో తన నటనకు గాను జాతీయ నటిగా కూడా అవార్డును కూడా అందుకుంది. ఈ మధ్య పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తెలుగులో ఒక టాక్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ‎అదే సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా. ఈ షోలో కీర్తి సురేష్ పాల్గొని తన పర్సనల్ అండ్ ప్రెఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.



‎ఈ షోలో భాగంగా హోస్ట్ జగపతిబాబు.. నీకు బాషా సినిమా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉందట కదా, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సివచ్చిందట కదా అని అడిగగా.. దానికి షాకైన కీర్తి సురేష్.. నవ్వుతూ.. ఎవరో మీకు అన్నీ చెప్పేశారు. పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాదు చాలాసార్లు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయితే, ఇది కేవలం ప్రోమోలో వచ్చిన సంభాషణ మాత్రం. పూర్తి వివరాలు ఇంకా తెలియదు. అసలు కీర్తి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెల్లాల్సి వచ్చింది అనేది తెలుసుకోవాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరీ. కాగా ఈ కాస్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫుల్ ఎపిసోడ్ వీడియో ఎప్పుడు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.