Siddhu Jonnalagadda: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే సిద్దు నటిస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుండడంతో ఈయనకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు సిద్దు జొన్నలగడ్డ. కాగా డిజే టిల్లు సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిద్ధు పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ ని అందుకున్నారు. అయితే ఇలా వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సమయంలోనే జాక్ సినిమా ఊహించని రిజల్ట్ ఇచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఊహించిన విధంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది. దానిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ మాట్లాడుతూ కొన్ని ఈ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు బాధ వేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ తిరిగి ఇచ్చేశాను. అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను. డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు. ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చారు సిద్దు జొన్నలగడ్డ.
Siddhu Jonnalagadda: సినిమా ప్లాప్ అవ్వడంతో అప్పు చేసి అలాంటి పని చేశాను: సిద్దు జొన్నలగడ్డ
