మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు అనేక చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఒకేసారి పలు చిత్రాలు షూటింగ్స్ లో తాను పాల్గొనగా వీటిలో షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈ డిసెంబర్ లోనే రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “ధమాకా”.
దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం ఓ వింటేజ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయగా రవితేజ డ్యూయల్ రోల్ లో అయితే నటించాడు. మరి ఈ చిత్రం నుంచి అయితే ఇపుడు చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ని అందించారు.
ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని అయితే ఈ డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా మాస్ మహారాజ స్టైలిష్ పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో రవితేజ చేస్తున్న మరో పాత్రపై ఈ పోస్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆరోజు అయితే మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పాలి.
ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు అలాగే తాను ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
MassMaharaja @RaviTeja_offl 's
Mass Storm From Dec 15th💥#Dhamaka Trailer Releasing on Dec 15th🤩#DhamakaFromDec23 @sreeleela14 @TrinadharaoNak1 @AbhishekOfficl @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl @peoplemediafcy pic.twitter.com/IfEPJpzU9z— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) December 11, 2022