‎Raviteja: రవితేజ ప్రమోషన్స్ కి రావడం లేదా.. ‎ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.. ఇలాంటి టైమ్ లో అవసరమా అంటూ!

Raviteja: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, అప్డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కాగా ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు.

‎ ఇలాంటి సమయంలోనే అభిమానులను ఒక వార్త కలవర పెడుతోంది. అదేమిటంటే ఈ సినిమా ప్రమోషన్స్ కి రవితేజ ఉండటం లేదట. అసలే రవితేజ ఫ్లాప్స్ లో ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నాయి. అయితే ఇలాంటి టైంలో జనాల్లోకి రాకుండా, ప్రమోషన్స్ కి రాకుండా ఉంటే ఇప్పుడు ఉన్న కాంపిటేషన్ లో ఎలా అంటున్నారు ఫ్యాన్స్. అసలే అక్టోబర్ 31 బాహుబలి రీ రిలీజ్ పోటీకి ఉంది. ‎ఇలాంటి టైమ్ లో రవితేజ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం ఇప్పుడు అభిమానులను భయపెడుతోంది.

‎అయితే ఇటీవల మాస్ జాతర ప్రమోషన్స్ కోసం ఒక అయిదారు ఇంటర్వ్యూలు ఒకే రోజు షూట్ చేసేసి వెళ్లిపోయారట. రవితేజ నెక్స్ట్ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం 25 రోజులు స్పెయిన్ వెళ్ళాడట. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట. రవితేజ వచ్చేవరకు షూట్ చేసిన ఇంటర్వ్యూలనే మెల్లిమెల్లిగా ఒక్కోటి వదులుతారట. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా వస్తాడా, 25 రోజులు అంటే పెద్ద షెడ్యూల్ కదా, సినిమా రిలీజ్ కి ఇక్కడ ఉంటాడా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన టైంలో ప్రమోషన్స్ కి లేకుండా వెళ్లిపోవడం మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత నిరాశే అని చెప్పాలి. హీరోలు ప్రమోషన్స్ లో యాక్టివ్గా పాల్గొని చేసిన కూడా సినిమాల కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి మరి ఇలాంటి సమయంలో రవితేజ ఇలా చేయడం అవసరమా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరీ ఈ కామెంట్స్ పై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.