‎Mass Jathara: రవితేజ మాస్ జాతర మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్!

Mass Jathara: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మాస్ మహారాజా. అయితే రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

‎ఇకపోతే ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాత‌ర‌. భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 31 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

Mass Jathara - Hudiyo Hudiyo Lyrical | Ravi Teja, Sreeleela | Bheems Ceciroleo | Bhanu Bogavarapu

‎ అందులో భాగంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌లు తు మేరా లవర్, ఓలే ఓలే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మూడవ పాట‌ను హుడియో హుడియో అనే మెలోడీ సాంగ్ ని విడుద‌ల చేశారు. భీమ్స్ సిసిరోలియో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. దేవ్ సాహిత్యాన్ని అందించ‌గా హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ క‌లిసి ఈ పాట‌ను పాడారు.