Mass Jathara Movie: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు మాస్ మహారాజా. అయితే రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.
గత కొన్నాళ్లుగా రవితేజ చేస్తున్న సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. దీంతో ఈసారి కథల ఎంపిక విషయంలో కాస్త గట్టిగానే ఫోకస్ చేశారు రవితేజ. ఇది ఇలా ఉంటే హీరో రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ మాస్ జాతర. ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా ఒక మాదిరి వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాములుగా రవితేజ సినిమా విడుదల అవుతుంది అంటే ఎలాంటి అంశాలు ఉంటాయో మాస్ జాతర సినిమా టీజర్ లో కూడా అలాంటి అంశాలు ఉన్నాయి. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సారీ హిట్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే సినిమా విషయానికి వస్తే.. శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
