Mass Jathara: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ. ఇకపోతే రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఇది రవితేజ 75వ సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. భాను బోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మాస్ బీట్ సాంగ్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. కాగా ఇందులో శ్రీలీలా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో విడుదల అయిన ధమాకా సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు వీరిద్దరూ చెప్పులు ఇరగదీసారు. అయితే మాస్ జాతర సినిమాలో కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. తాజాగా విడుదల అయిన “ఓలే ఓలే”.. అనే పాటకు శ్రీ లీలా అలాగే రవితేజ స్టెప్పులను ఇరగదీశారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి రాయగా భీమ్స్, రోహిణి పాడారు. ఇక మాస్ జాతర సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
