విజయ్ “లియో” కి మామూలు ప్లాన్ చెయ్యట్లేదుగా.!

తమిళ సినిమా దగ్గర తన సినిమాల టేకింగ్ తో అయితే ఇప్పుడు ఓ రేంజ్ లో ఆడియెన్స్ కి ట్రీట్ ఇస్తున్న దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ దర్శకుడు లోకేష్ కనగ రాజు అని చెప్పాలి. మరి లోకేష్ అయితే లాస్ట్ గా విక్రమ్, ఖైదీ సినిమాలతో ఓ రేంజ్ లో ట్రీట్ ని అందించగా ఇక నెక్స్ట్ ఇదే సినిమాల యూనివర్స్ లో హీరో దళపతి విజయ్ తో “లియో” అనే సినిమాని అనౌన్స్ చేసి శరవేగంగా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో దాదాపు 50 నుంచి 60 శాతం షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయ్యిపోగా నిన్ననే కాశ్మీర్ లో అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కాగా ఈ సినిమాకి అయితే ప్రమోషన్స్ ని వేరే లెవెల్లో ప్లాన్ చేస్తుండగా తెలుస్తుంది. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ లో 19న రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా అంతకు ముందు భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారట.

అంతకు ముందే వరల్డ్ వెయిట్ చేస్తున్న క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్ 5 న అయితే స్టార్ట్ కానుండగా ఆ సమయంలో అయితే క్రికెట్ లో గాను లియో భారీ ప్రమోషన్స్ ని చేయనున్నారట. దీనితో ఈ సినిమాకి వరల్డ్ లెవెల్లో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈ భారీ సినిమాలో సంజయ్ దత్ అయితే విలన్ గా నటిస్తున్నాడు. కాగా అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.