క్రేజీ బజ్ – ఉగాదికి ప్లాన్ మార్చిన SSMB28 టీం?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న నాన్ పాన్ ఇండియా సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ సినిమా మాత్రమే ఉందని చెప్పాలి. కాగా ఈ సినిమాని మేకర్స్ భారీ బడ్జెట్ తో క్రేజీ ఏక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా..

గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా ఉగాది పండుగ ట్రీట్ కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తూ వస్తున్నాయి. దాదాపు గా సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రివీల్ చేస్తారని బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే మేకర్స్ ఈ ప్లాన్ మార్చినట్టుగా క్రేజీ బజ్ తెలుస్తుంది.

దీనితో ఈ పండుగ నాడు ఏకంగా గ్లింప్స్ వీడియో నే చిత్ర యూనిట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ మేకర్స్ కూడా ఉగాదికి అప్డేట్ ని కన్ఫర్మ్ చేశారు. దీనితో టైటిల్ లేకుండా సినిమా గ్లింప్స్ ని ఇప్పుడు రిలీజ్ చేస్తారని వినికిడి. కాగా ఈ భారీ ట్రీట్ వస్తుందో లేదో చూడాలి.

ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమారు 200 కోట్ల బడ్జెట్ తో హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగష్టు కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి గాని ఈ సినిమా రిలీజ్ ఉంటుంది.