టాలీవుడ్ సినిమా దగ్గర అతి పెద్ద సినిమా ఫెస్టివల్ సంక్రాంతి కానుకగా అయితే ఈ ఏడాదిలో పలు చిత్రాలు రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి.
మరి వీరి నుంచి ముచ్చటగా మూడో సినిమా ఇది కావడంతో హైప్ గట్టిగానే సెట్ అయింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక చాలా రకాల మాటలు వచ్చాయి కానీ ఒక దగ్గర మంచి వసూళ్లు ఒక దగ్గర తక్కువ వసూళ్లు ఈ చిత్రానికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో వసూళ్లు సూపర్ గా ఉంటే నైజాంలో మాత్రం బాగా తక్కువ ఈ సినిమాకి వస్తున్నాయి.
కాగా నైజాం లో ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ జరిగిన బిజినెస్ పరంగా చూస్తే గుంటూరు కారం రాబట్టాల్సింది చాలా ఉందట. కాగా నైజాం హక్కులని దిల్ రాజు 40 కోట్లకి పైగానే పెట్టి కొంటే ఈ సినిమా ఇంకా 30 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో నైజాంలో గుంటూరు కారంకి భారీ నష్టాలు తప్పవని అంటున్నారు. కాగా ఈ అంశంపై నిర్మాత నాగవంశీ కూడా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో ఏపీలో వసూళ్లు చాలా బాగున్నాయని కానీ నైజాం లో ఎందుకో కాస్త తక్కువ వస్తున్నాయి అని తెలిపాడు. దీనితో గుంటూరు కారంపై ఆ వార్తల్లో ఎలాంటి అబద్దం లేదు అనేది వాస్తవం. మరి చివరగా గుంటూరు కారం ఎక్కడ ఆగుతుందో చూడాలి.