టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా చేసిన పలు హిట్ చిత్రాల్లో తన కెరీర్ లో భారీ హిట్ చిత్రం “శ్రీమంతుడు” కూడా ఒకటి. వరుస డిజాస్టర్ చిత్రాలు అనంతరం దర్శకుడు కొరటాల శివ తీసుకొచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి ట్రెండ్ ని సెట్ చేసింది.
ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతగానో నచ్చడంతో ఈ సినిమా అప్పట్లో నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమా విడుదల అయ్యిన నాటి నుంచే ఈ సినిమా కథ నాది అంటూ ఒకతను కోర్ట్ లో కేసు వేశారు. దీనితో అక్కడ నుంచి మొదలైన ఈ కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది.
రీసెంట్ గానే ఒరిజినల్ కథ ఉన్న శరత్ చంద్రకి అనుకూలంగా ధర్మస్థానం తీర్పు అందించడంతో మరోసారి ఈ కేసు కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. కాగా దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఏదొక సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. నా నవల కథ కాపీ కొట్టి సినిమా తీసి 15 లక్షలు తీసుకొని కేసు వదులుకోమని ఒరిజినల్ రైటర్ కి వారు చెప్పారట.
కానీ వారికి మాత్రం శరత్ చంద్ర గట్టి షాక్ నే ఇచ్చారు. కాగా తనకి 15 లక్షలు ఇచ్చి సెటిల్ చేస్తే కుదరదు అని తనకి సినిమాలో ఖచ్చితంగా వాటా కావాలని బాంబు పేల్చారు. ఒకవేళ తన డిమాండ్ నెరవేరని పక్షంలో మహేష్ బాబు నిర్మాతలు అందరికి కూడా నోటీసులు వెళతాయని తాను తేల్చేసారు. మొత్తానికి అయ్యితే ఈ ఇష్యూ చాలా దూరమే వెళ్లేలా అనిపిస్తుంది.