ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలు చాలానే ఉన్నప్పటికీ ఒక సినిమాని మించిన సినిమా అయితే ఇంకొకటి ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. కాగా ఆ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సినిమా అని చెప్పాలి.
మహేష్ బాబు కెరీర్ లో చేయనున్న 29వ సినిమా ఇది కావడంతో భారీ హైప్ ఉంది. ఇక ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఉన్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికి ముందు సినిమా కోసం ప్రిపేర్ అయ్యే పనిలో ఉన్నాడు.
కాగా ఇప్పుడు మహేష్ జర్మనీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు చాలా పర్టిక్యులర్ గా ఉన్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనితో మహేష్ బాబు రాజమౌళికి కండిషన్స్ పెట్టాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో మహేష్ బాబు ఈ సినిమాని ఎలాగైనా హిట్ సినిమాగా మలచాలని సూచించాడు అని టాక్. తాను ప్రస్తుతానికి సినిమాకి ఎలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోట్లేదు అని కానీ తనకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ సినిమా కావాలని కోరుకుంటున్నాడట. దీనితో ఎందుకో ఈ సినిమా విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉన్నాడని అంటున్నారు.