బిగ్ అప్డేట్ : “గుంటూరు కారం” పాన్ ఇండియా ఓటిటి డేట్ ఖరారు.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పెద్ద హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేసిన హ్యాట్రిక్ సినిమా ఇది కాగా భారీ వసూళ్లు అందుకుంది.

అలాగే కాస్త వేరే టాక్ తో కూడా రీజనల్ గా ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని మహేష్ బాబు కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు థియేటర్స్ రన్ అనంతరం ఫైనల్ గా ఓటిటిలో విడుదల కావడానికి సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధర ఇచ్చి కొనుగోలు చేయగా ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ కి వచ్చేయడానికి సిద్ధం అయ్యినట్టుగా నెట్ ఫ్లిక్స్ సహా చిత్ర నిర్మాణ సంస్థ కూడా రిలీజ్ డేట్ ని వెల్లడి చేశారు. దీనితో గత కొన్ని రోజులు నుంచి కూడా వినిపిస్తున్న ఫిబ్రవరి 9నే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

కాగా గుంటూరు కారం అయితే నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఇంకా ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి సపోర్టింగ్ రోల్ లో నటించింది.