టైం దగ్గర పడుతున్నా “వాల్తేరు వీరయ్య” పై చిన్న చూపు.?

chiranjeevi-ravi-teja-starrer-titled-waltair-veerayya-001

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అయితే దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని తలపించేలా సాలిడ్ హంగులతో తెరకెక్కగా ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేయడం విశేషం.

మరి ఇదంతా బాగానే ఉంది కానీ ఈ  చిత్రం ఓవర్సీస్ రిలీజ్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింటింగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాల్తేరు వీరయ్య కి అక్కడ మంచి డిమాండ్ ఉన్నప్పటికీ..

వీరసింహా రెడ్డి కి ఇచ్చిన షో లు కానీ స్క్రీన్స్ లలో షో లను వదలడంతో కానీ చాలా లేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పై నిన్నటి నుంచి మెగా ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా పలు షో లు ఓపెన్ చేయకపోవడం ఏదైతే ఉందో అది వాల్తేరు వీరయ్యపై చిన్న చూపే అని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ మాత్రం మెగా ఫ్యాన్స్ చెప్తుంది అయితే నిజమే కానీ ఇంకా రిలీజ్ కి రెండు రోజులు సమయం ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం కానుందో చూడాలి. మరి ఈ సినిమాలో అయితే హీరోయిన్స్ గా శృతి హాసన్, క్యాథెరిన్ లు నటించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.