Sreekanth Odela: చిరంజీవి స్టార్ హీరో అయిన నా సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రమే: శ్రీకాంత్ ఓదెల

Sreekanth Odela: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఎంతోమంది చిరంజీవిని చూసి సినిమాలలోకి రావాలని భావించి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగినవారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు కొందరు హీరోలుగా సక్సెస్ కాగా మరికొందరు దర్శకులుగా నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనతోనే పనిచేస్తున్నారు.

ఇలా చిరంజీవిని చూస్తూ సినిమాలలోకి రావాలని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఒకరు. నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు నాని నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఈయన సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నేను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను అంటే ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నానని తెలిపారు.. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాను అలాంటిది ఆయననే డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిరంజీవి గారికి సంబంధించిన సినిమా స్క్రిప్ట్ మొత్తం 48 గంటల్లోనే పూర్తి చేసామని తెలిపారు అయితే ఇకపై మీరు నా సినిమాలో పాత చిరంజీవిని చూడరని ఆయన వయసుకు అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశామని తెలియజేశారు.

ఇక తాను చిరంజీవికి చాలా పెద్ద అభిమానిని అది ఆయన క్యారవాన్ ఉన్నంతవరకు మాత్రమే ఒక్కసారి
క్యారవాన్ దిగి సినిమా షూటింగ్లోకి అడుగుపెడితే ఆయన నా సినిమాల్లో ఒక క్యారెక్టర్ మాత్రమే అంటూ ఈయన కామెంట్లు చేశారు. అయితే ఈయన కామెంట్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన చిరంజీవికి వీరాభిమాని అయినా తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేస్తున్నాననే భావన కాకుండా పూర్తిస్థాయిలో సినిమాపై ఫోకస్ పెట్టి ఎంత పెద్ద హీరో నటిస్తున్న ఆయన నటించే క్యారెక్టర్ మాత్రమే చూస్తానని చెప్పడంతో సినిమాలపై ఈయనకు ఉన్న నిబద్ధతపై ప్రశంసల కురిపిస్తున్నారు.