ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూసి అడియన్స్, విమర్శకులు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఆదివారం ఒక్కరోజే రెండు వందల కోట్ల వరకు రాట్టింది. హిందీ మార్కెట్లోనే రూ.86 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక సోమవారం సైతం పుష్ప 2 వసూళ్లు భారీగానే వచ్చినట్లుగా తెలుస్తోంది ఐదో రోజు రూ.80 నుంచి వంద కోట్లు వరకు వచ్చినట్లు సమాచారం. ప్రతీరోజూ పుష్ప రూ.150 నుంచి రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మార్క్ దాటబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్లుగానే రూ.1000 కోట్లు రాబట్టేలా ఉంది.ఇప్పటివరకు ఈ సినిమా రూ.830 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం.
ఇక సోమవారం లెక్కలు కలిపితే ఈ సినిమా రూ.900 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేసేలా ఉంది.