గేమ్ డేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు మూవీ టీం. డైరెక్టర్ శంకర్ మొదటిసారిగా తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. అందులోనూ ఈ సినిమా హెవీ బడ్జెట్ మూవీ కావటం అలాగే శంకర్ డైరెక్షన్ కి రామ్ చరణ్ యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడవటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా హిట్ అవ్వటం అనేది నలుగురు వ్యక్తులకి కీలకం.
సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం ఈ నలుగురు మీద ఖచ్చితంగా పడి తీరుతుంది. ఆ నలుగురు ఎవరంటే మొదటిగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శంకర్. ఇతను తెలుగులో తీస్తున్న ఫస్ట్ మూవీ ఇది ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం అయింది. అందులోనూ శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ టు మూవీ పెద్ద డిజాస్టర్ మూటకట్టుకోవటంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు సినీ క్రిటిక్స్. అంతేకాకుండా శంకర్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదని చెప్పాలి.
ఇప్పుడు శంకర్ కెరియర్ మళ్లీ గాడిన పడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాలి. అలాగే హీరో రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా హిట్ అవ్వటం చాలా ముఖ్యం త్రిబుల్ ఆర్ సినిమాతో ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాంతో ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ దగ్గర నుంచి అలాంటి ఒక మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. త్రిబుల్ ఆర్ స్థాయికి ఏ మాత్రం తగ్గినా సినిమా రిజల్ట్స్ వేరేగా ఉంటాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందులోనూ ఎన్టీఆర్ దేవర సినిమాతో సోలో హిట్ కొట్టాడు కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ నుంచి సోలో హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇక హీరోయిన్ కియారా అద్వానీకి కూడా ఈ సినిమా చాలా అవసరం. ఎందుకంటే తనకి ఇప్పటివరకు సరియైన పాన్ ఇండియా మూవీ పడలేదు. నేషనల్ వైడ్ గా తనకి ఫేమ్ కావాలంటే కచ్చితంగా ఈ సినిమా హిట్ పడి తీరాలి. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ సాధించాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. అందుకోసమే దిల్ రాజు సినిమా మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి.