ఇండస్ట్రీలో హీరోగా ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు శ్రీ సింహ. ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి రెండవ కుమారుడే శ్రీ సింహ. యమదొంగ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ సింహ ఆ తర్వాత సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలో కూడా నటించాడు. ఆ తరువాత మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి చిత్రాలలో నటించాడు. ఇటీవలే మత్తు వదలరా 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ నటుడు ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు.
సీనియర్ నటుడు మురళీమోహన్ కుమారుడు అయిన రామ్మోహన్ కుమార్తె రాగ మాగంటితో ఏడడుగులు వేశాడు. డిసెంబర్ 14న దుబాయిలో వీళ్ళకి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్ళిలో రాజమౌళి చేసిన డాన్స్ ఎంత పెద్ద ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన భార్యని పరిచయం చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు శ్రీ సింహ.
ఇప్పటికీ ఆరేళ్లయింది.. ఎప్పటికీ ఇలాగే అంటూ రాసిపెట్టుంది అంటూ హాష్ టాగ్ ఇచ్చాడు. ఈ పోస్టును బట్టి చూస్తే వీళ్లిద్దరూ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని అర్థమవుతుంది. ఇటీవలే పెద్దలని ఒప్పించి ప్రేమని పెళ్లి వరకు తీసుకు వచ్చినట్లున్నారు ఈ జంట. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగగా ఈనెల 14న దుబాయ్లో ఒక ఐలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
రాగా మాగంటి మరెవరో కాదు నటుడు మురళీమోహన్ కుమారుడు రామ్మోహన్ కుమార్తె రాగా మాగంటి విదేశాల్లో బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన రాగా మాగంటి ప్రస్తుతం తన కుటుంబ వ్యాపారాలని చూసుకుంటుంది. ఇక కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి బాటలో పయనిస్తూ సంగీత దర్శకుడిగా సింగర్ గా రాణిస్తున్నాడు. అయితే ఇతనికి ఇంకా వివాహం కాకపోవటం గమనార్హం.