ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఆహా లో బాలయ్య బాబు హోస్టింగ్ చేస్తున్న ది ఆన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటిసారిగా బాలకృష్ణ ఈ టాక్ షో తో హోస్టుగా కనిపించారు. ఆయన ఈ షోని ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆయన సెన్సార్ హ్యూమర్ ఏంటనేది సాధారణ ప్రజలకి ఈ షో ద్వారానే తెలిసింది. ఆయన ఎనర్జీతో నందమూరి నటసింహం ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ పూర్తిచేసుకుని ప్రస్తుతం సీజన్ 4 నడుస్తుంది.
ఇప్పటికే ఈ సీజన్లో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో సూర్య, ఇక తెలుగు హీరో అల్లు అర్జున్ అయితే ఫ్యామిలీతో సహా పాల్గొని షోని అతి పెద్ద హిట్ చేశాడు. తర్వాత నవీన్ పోలిశెట్టి, శ్రీ లీల నవ్వుల పువ్వులు పూయించారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక స్టార్ హీరో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా వెంకటేష్ మన ముందుకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ది అన్ స్టాపబుల్ షో లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 22న ఎపిసోడ్ షూటింగ్ జరగబోతుందంట. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటిసారి బాలకృష్ణ హోస్టింగ్ లో వెంకటేష్ ఒక టాక్ షోలో పాల్గొనడం విశేషం.
సాధారణంగా వెంకటేష్ ఇలాంటి టాక్ షోస్ కి చాలా తక్కువ హాజరవుతాడు. ఇప్పుడు బాలయ్య షో కి వస్తున్నారు అనగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. బాలయ్య చిలిపి ప్రశ్నలకి వెంకటేష్ ఎలాంటి కొంటె సమాధానాలు ఇస్తాడో అంటూ వెయిట్ చేస్తున్నారు వారి అభిమానులు.అప్పుడే నాగార్జున, చిరంజీవి అభిమానులు మా వాళ్ళతో ఎప్పుడు షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Venky mama , Balayya oke stage meeda 😎 Never before ever after entertaining episode ki ready avvandi amma .#aha #UnstoppableS4 #nandamuribalakrishna #Nandamuribalakrishna #UnstoppableS4 #NBK #Sankranthi @VenkyMama pic.twitter.com/355ff1gJZ1
— ahavideoin (@ahavideoIN) December 21, 2024