తండ్రిగా నా కడుపు తరుక్కుపోతుంది.. కొడుకు ప్రవర్తనకి ఆందోళన చెందుతున్న అల్లు అరవింద్!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పందిస్తూ అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరమని అది ఒక ప్రమాదం అని, తన అభిమాని చనిపోవడం, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావటం తనని ఎంతగానో బాదించాయని చెప్పారు.

అయితే అర్జున్ మాట్లాడిన తర్వాత మీడియాతో అతని తండ్రి, నిర్మాత అయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని ఉద్దేశంతో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయారు అని మీడియాతో చెప్పారు. తాను నటించిన పాన్ ఇండియా మూవీని థియేటర్లో చూసుకుందామని అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. థియేటర్ వద్ద అటువంటి సంఘటన జరిగిన తరువాత అర్జున్ మా ఇంట్లో గార్డెన్లో ఒక మూలన కూర్చుని అదే ఆలోచనలో ఉంటున్నాడు.

పలువురు పుష్ప 2 సాధించిన ఘన విజయాలకి సెలబ్రేషన్స్ చేస్తామని చెబుతున్నా ఎక్కడికి వెళ్ళటం లేదు, తన అభిమాని కుటుంబం అలా అయిపోయినందుకు బాధపడుతున్నాడు. వాడు అలా బాధపడుతుంటే తండ్రిగా నా కడుపు తరుక్కుపోతుంది. శ్రీ తేజ విషయంలో బాధ్యత లేకుండా ఉన్నాడని అంటున్నారు కానీ అందులో నిజం లేదు. మైత్రి మూవీ మేకర్స్, థియేటర్ యాజమాన్యం, తాము మనీ కలెక్ట్ చేసి నా కుటుంబానికి సహాయం చేద్దాం అనుకున్నామం.

కానీ ఆ విషయం బయటకు చెప్పటానికి ఇది సరైన సమయం కాదని బన్నీ అనటంతో ఊరుకున్నామని ఈ విషయం గురించి మరొక సందర్భంలో చెబుతామని చెప్పారు అరవింద్. బన్నీ 22 సంవత్సరాలు కష్టపడి ఇంతటి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఫేమ్ అంతా ఒక రాత్రిలోనూ, ఒక ప్రెస్ మీట్ తోనో రాలేదు అని చెప్పిన అరవింద్ 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు, ఎప్పుడైనా మేము ఇలా వ్యవహరించామా.. అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ ని చూస్తుంటే తండ్రిగా బాధగా ఉంది : Allu Aravind | Allu Arjun | 10TV Entertainment