విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి శారీ అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతుంది. తెలుగు, తమిళ,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమాని ఆర్జీవి ఆర్ వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరి కృష్ణ కమల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెర కెక్కుతున్న ఈ సినిమాలో సత్య యాదవ్ ఆరాధ్య దేవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ని ఒక సాంగ్ ని రిలీజ్ చేశాడు ఆర్జీవి. ఆ సాంగ్ లో హీరోయిన్ ఆరాధ్య దేవి అందాలని బాగానే క్యాప్చర్ చేసిన ఆర్జీవి ఇప్పుడు వరల్డ్ శారీ డే అంటూ తన సినిమా నుంచి మరొక సాంగ్ ని రిలీజ్ చేశాడు.
శారీ గర్ల్ అంటూ ఇంగ్లీషులో సాగే ఈ సాంగ్ ని ఆర్జివి ఛానల్ లో రిలీజ్ చేశారు. ఈ పాటలో కూడా హీరోయిన్ అందాలని ఓ రేంజ్ లో వాడుకున్నాడు ఆర్జీవి. ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ముందుండే ఆర్జీవి శారీ సినిమాతో ఈసారి ఏఐ లేటెస్ట్ టెక్నాలజీని మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ప్రయోగించారు. సంగీత ప్రపంచంలో ఇంటెలిజెన్స్ సప్త స్వరాలతో విన్యాసాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్,పాటల రచయితలకు సింగర్స్ కి సమానంగా సవాల్ చేస్తుంది.
రాంగోపాల్ వర్మ తాజా చిత్రం శారీ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఫస్ట్ టైం అందించే సంగీతంతో మ్యాజిక్ చేయబోతున్నారు. శివ సినిమాతో ఇండస్ట్రీకి స్టడీ కామ్ అనే సరికొత్త సాధనాన్ని పరిచయం చేసిన ఆర్జీవి రక్త చరిత్ర సినిమాతో డిజిటల్ కెమెరాలని పరిచయం చేశారు. ఇప్పుడు ఏ ఐ టెక్నాలజీతో ఫస్ట్ టైం ఏఐ యాప్స్ తో రూపొందించిన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని జనవరి 30న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు ఆర్జీవి.
HAPPY WORLD SAAREE DAY ..Here’s “SAAREE GIRL” song from SAAREE film ..Film releasing Jan 30 th https://t.co/TTxe82RsN2https://t.co/ksFZTTQFa4
— Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2024