TG: తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం పై బిఆర్ఎస్ నేతలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడకు రోడ్ షో చేసుకుంటూ రావడం వల్ల తోక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా చనిపోయిందని చిన్నారి శ్రీ తేజ్ ఆసుపత్రి పాలయ్యారని మండిపడ్డారు ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ అరెస్టు చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కానీ ఏ ఒక్కరు వెళ్లి కూడా ఆ బాబును పరామర్శించలేదు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే.
ఇక ఈ విషయం పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బిఆర్ఎస్ నేతలు పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ చేస్తున్న కామెంట్లు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ విషయంలో ఇలా చట్టపరంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తన తమ్ముడి విషయంలో ఎందుకు వ్యవహరించలేదు అంటూ ప్రశ్నించారు. సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్.. నీ తమ్ముడి వాళ్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ రాస్తే అతన్ని ఎందుకు అరెస్టు చేయవని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు.
నీ తమ్ముడికి ఒక రూల్ ప్రజలకు మరొక రులా.. వారందరిని భయభ్రాంతులకు గురిచేసి మీ తమ్ముడు అరెస్టును ఆపావు నీ తమ్ముడు విషయంలో చట్టం మీకు చుట్టమయిందా అంటూ ప్రశ్నించారు.కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.. కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు మాత్రం ప్రజలపై నీకేదో ప్రేమ ఉన్నట్టు ముసలి కన్నీళ్లు కారుస్తున్నావు.కాంగ్రెస్ ప్రభుత్వానికి నాణ్యమైన అన్నం పెట్టడం చేతగాకపోవడంతో వాంకిడి హాస్టల్‌లో శైలజ అనే గిరిజన విద్యార్థిని 12 రోజులు నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడి, తుది శ్వాస విడిచింది.
ఇలా శైలజ మరణించడంతో కనీసం ఆ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు ఒక్క నిమిషం సమయం దొరకలేదా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తీరిక దొరకలేదా అంటూ ఈయన ప్రశ్నల వర్షం కురిపించారు ఇలా శైలజ కుటుంబాన్ని పరామర్శించడానికి మా ఎమ్మెల్యే వెళితే అర్ధరాత్రి కాడ అరెస్టులు చేయించావు అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ రేవంత్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు.