Allu Arjun: అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం, ఒకరోజు మొత్తం తనని జైలులో బంధించి మరుసటి రోజు విడుదల చేయడంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాల పరంగా కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి..
అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో సినిమా సెలబ్రిటీలందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు కానీ ఎవరైనా ఆ బాబుని పరామర్శించడానికి వెళ్ళారా అల్లు అర్జున్ అరెస్టు చేస్తే ఎందుకు అంత బాధ పడుతున్నారు తను తప్పు చేశాడు కదా అంటూ అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం మరోసారి చర్చలకు కారణమైంది.
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేమీ లేదని చెప్పుకువచ్చారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పు ఏమాత్రం లేదు. ఆయన సినిమా రిలీజ్ కావడంతో ప్రీమియర్ షో కి వచ్చారు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు.
అయితే తాజాగా ఈ విషయంపై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్టు చేయటం గురించి ఈమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఒక హీరోగా తన సినిమా చూడటం కోసం సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జరిగిన ప్రమాదాన్ని ఆయన ప్రేరేపించినది కాదు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులను కాకుండా ఏ 11 ముద్దాయిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్టు చేయటం సరికాదంటూ పురందేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.