TG: మాకు హీరోలు,సినీ పరిశ్రమ అంటే ద్వేషం లేదు… మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు!

TG: ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా వివాదం కొనసాగుతుంది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ కారణంగానే ఆమె మరణించింది అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తొక్కిసలాట అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని ఇందులో ఎవరి తప్పులేదు అంటూ మాట్లాడారు అదేవిధంగా కొంతమంది నన్ను ఉద్దేశించి మాట్లాడటం పూర్తిగా బాధ కలిగించే అంశమని అల్లు అర్జున్ తెలిపారు. ఇలా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఈ ఘటన గురించి మాట్లాడుతూ..శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. మాకు కానీ, మా సీఎం కి కానీ ప్రభుత్వానికి కానీ ఎవ్వరి మీద కోపం లేదు.. అని స్పష్టం చేశారు. మానవతా దృక్పధంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయినారని తెలిసి కూడా అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపారు.

ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించలేదని, పోలీసులు తనని హెచ్చరించే వరకు కూడా ఈయన అక్కడి నుంచి వెళ్లలేదని తెలిపారు. ఇక వెళ్లేటప్పుడు కూడా అల్లు అర్జున్ సైలెంట్ గా కారులో కూర్చుని వెళ్లిపోకుండాఓపెన్ టాప్‌లో వెళ్లడం అభ్యంతరకరమన్నారు. మేము సినీ పరిశ్రమను కూడా కాపాడుకోవాలి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా? మాకు హీరోల మీద సినీ ఇండస్ట్రీ మీద ఏ విధమైనటువంటి కోపం లేదనీ స్పష్టం చేశారు.