Pushpa: స్మగ్లర్లు కూడా హీరోలేనా… పుష్ప సినిమాపై రెచ్చిపోయిన బన్నీ!

Pushpa: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడంతో ఈయన వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

ఇకపోతే ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ అల్లు అర్జున్ పట్ల విమర్శలు చేయగా మరి కొందరు ఆయన తప్పులేదు అంటూ సమర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే సిపిఐ నారాయణ సైతం ఈ సినిమాపై స్పందిస్తూ అల్లు అర్జున్ తీరుని పూర్తిగా తప్పు పట్టారు.. ఒకప్పుడు హీరోలు అంటే బాలుడు మంచివాడు అనే విధంగా సినిమాలు ఉండేవి ఒకవేళ సినిమాలలో దొంగగా డాన్ గా నటించిన చివరికి ఆయన మంచిగా మారినట్టు చూపించేవారు.

ఇక ప్రస్తుత కాలంలో చేసే సినిమాలలో హీరోలు డాన్లుగాను దొంగలుగాను స్మగ్లర్లు గాను చూపిస్తున్నారని తెలిపారు. ఇక ఎర్రచందనం దొంగలిస్తూ స్మగ్లింగ్ చేసే వాళ్లు కూడా హీరోలేనా మరి ఇలాంటివి సమర్థిస్తూ తగ్గేదేలే అనే డైలాగులు పెట్టడం ఏంటి అంటూ మండిపడ్డారు.పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చిని చూడగలవా అని ప్రశ్నించారు. లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి అనే చీపు డైలాగులు.. ఇది ఏ కళకు నిదర్శనం అన్నారు. ఏ తెలుగు భాషకు, యాసకు ఆదర్శం మన్నారు.

ఇలాంటి సినిమాల వల్ల ప్రజలు పూర్తిగా తప్పుదోవ కట్టే అవకాశాలు ఉన్నాయని ఈయన తెలియజేశారు. ఇలాంటి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలను ఇవ్వటం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అంటూ ఈయన మాట్లాడారు. ఇలా సిపిఐ నారాయణ అల్లు అర్జున్ గురించి అలాగే పుష్ప 2 సినిమా గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో కొందరు పూర్తిగా తప్పుపడుతున్నారు అది ఒక సినిమా వినోదం కోసం మాత్రమేనని సినిమాని ఎప్పటికీ సినిమాలాగే చూడాలి అని కామెంట్లు చేస్తున్నారు.