Roja: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కొన్నిచోట్ల పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ కూడా అభిమానం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉట్టి పడిందని చెప్పాలి. ఇకపోతే కొన్నిచోట్ల కూటమి నేతలు జగనన్న కటౌట్ పెట్టడానికి కూడా అనుమతులు వెల్లడించలేదు ఇలాంటి తరుణంలోని మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. జగనన్నను తిరిగి మళ్లీ సీఎంను చేసే వరకు మా పోరాటం ఆపబోమని ఈమె తెలియ చేశారు. కూటమి ప్రభుత్వం కూటమి నేతలు జగనన్న కటౌట్ చూసి భయపడుతున్నారని ఈమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఈయన ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రజలను నమ్మించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుందని ఈమె తెలిపారు. దేవాలయాలలోనూ పబ్బులు బెల్ట్ షాపులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇక గ్రామస్థాయిలో నాయకుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ అవినీతి జరగలేదు అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.