Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మన్యం జిల్లా అనంతగిరి గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నటువంటి ఈయన అక్కడ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారని ఈయన తెలిపారు. అధికారం ఉన్నప్పుడే కాదు అధికారం లేనప్పుడు కూడా మనం మన్యం జిల్లాలలో పర్యటించామని ఈయన తెలియజేశారు.
అందరిలాగా నాకు బుగ్గలు గిల్లడం తల నిమరడం రాదని ఈయన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.తాను దూరంగా ఉన్నా.. ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తినని స్పష్టం చేశారు. నేను నా పేషికి కూడా ఒకటే మాట చెప్పాను. రెండు నెలలకొకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి అని. గిరిజన ప్రజలందరికీ మాటిస్తున్నాను, నేను మీకోసం ఒళ్లు వంచి పనిచేస్తానని తెలిపారు. నేను ఈ గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న సమయంలో మూడు ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయని పవన్ తెలిపారు.
ఒకటి రోడ్లు, రెండు తాగు నీరు, మూడు యువతకి ఉపాధి అవకాశాలు. ఈ మూడు సమస్యలను ప్రధానంగా తీసుకున్నానని తెలిపారు. ఇక్కడ ఎన్నో జలపాతాలు ఉన్నాయి ఎంతో అందమైనటువంటి ప్రకృతి ఉంది. దీనిని టూరిజంగా అభివృద్ధి చేయాలి అంటే రోడ్లు వేయాలి. రోడ్లు వేయడం కోసం భారీ ఖర్చు అవుతుంది. అయితే గత ప్రభుత్వం మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది.
రుషికొండ ప్యాలెస్‌కి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. కానీ మన గిరిజన ప్రాంతం బాగుజోలలో రూ.9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయారనీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైర్ అయ్యారు. కానీ నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను. మీకోసం అహర్నిశలు ఎండనకా, వాననకా కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరికీ కష్టాలు తీర్చాలని నేను తిరుమల కొండ ఎక్కి వెళ్లాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.