Revanth Reddy: 6 గ్యారంటీలను అమలు పరచలేకపోతున్నాం… చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయింది అయితే ఇప్పటివరకు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే తెలుస్తోంది. ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 6 గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట పై నిలబడకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కుదరడం లేదంటూ మాట మారుస్తున్నారు.

ఇలా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడానికి బీఆర్ఎస్ నాయకులే కారణమని తెలిపారు. వారు పరిపాలించిన ఈ పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చేసారని రాష్ట్రంలో ప్రతి ఒక్కటిని తాకట్టుపెట్టి అప్పులు తీసుకు వచ్చారని రేవంత్ తెలిపారు. వీరు చేసిన అప్పులకు ప్రతి నెల 6500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని తెలిపారు.

ఈ పాపాల బైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ లో భూములు, హైటెక్ సిటీ ఇలా అన్నీ అమ్మేశారు. చివరికీ వైన్ షాపులను మిగల్చలేదు అంటూ రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ఫైర్ అయ్యారు.నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు. పదేల్ల కాలంలో 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. వ్యసనాలు వ్యాపారాలను కూడా బీఆర్ఎస్ కొల్లగొట్టింది. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటున్నాం. హాస్టళ్ల కోసం మీరు ఏం చేశారు..? కేసీఆర్ సభకు వస్తే కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా కానీ ఆయన మాత్రం ఏడాది నుంచి అసెంబ్లీకి రాకుండా ఉన్నారని తెలిపారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు పరచలేక పోతున్నాను అంటూ వ్యాకనించడంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే సమయంలో రాష్ట్రం అప్పుల పాలయిందని మీకు తెలియదా కేవలం ఓట్లు గెలుపొందడం కోసమే ఇలాంటి దొంగ హామీలు ఇచ్చారు అంటూ రాష్ట్ర ప్రజలు సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.