Nagababu: డిసెంబర్ 21 వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఎంతోమంది అభిమానులు వైకాపా నేతలు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సినీ నటుడు నిర్మాత నాగబాబు సైతం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఇక ఈయన పోస్ట్ చేస్తూ..మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నాగబాబు పోస్ట్ పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాగే పదికాలాలపాటు చల్లగా ఉండమని అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉండమనేనా మీరు చెప్పేది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు అలాగే మరికొందరు మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా లేకపోతే ఆయన పట్ల విమర్శలు చేశారా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇలా నాగబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తలు తనకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా జగన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఎంతో ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు,
మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను….— Naga Babu Konidela (@NagaBabuOffl) December 21, 2024