ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ కాకూడదు.. హీరోలకి మాస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద ఈ 25 లక్షల చెక్ ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలో ఉండవు.

అవేమైనా దేశభక్తి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన సినిమాలా..మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల విషయం వేరు. కానీ పుష్ప సినిమాని నేను చూశాను సినిమా మూడు గంటల పైనే ఉంది. సినిమాల వల్ల యువత చెడిపోతుంది. ఇకపై చారిత్రక సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్పితే తెలుగు సినిమాలు చూడను అని చెప్పిన వెంకటరెడ్డి ఈ మూడు గంటల సమయంలో చాలా పనులు చేసుకోవచ్చు అంటూ ఆవేశపడ్డారు. అంతేకాకుండా సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.

పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బయటికి రాకూడదు, షోలు చేయడానికి బయట తిరగకూడదు. ఒకవేళ బయటికి వచ్చినా ఓపెన్ టాప్ కారులో తిరగొద్దు. మళ్లీ ఇలాంటివి రిపీట్ కావద్దు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మేము సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాము అందుకు హీరోలు ప్రొడ్యూసర్స్ కోపరేట్ చేయాలని కోరారు. అలాగే శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై ఎంక్వయిరీ చేసిన కోమటిరెడ్డి చిన్నారి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని మెదడు ఊపిరితిత్తులకు గాలి అందడం లేదని వెల్లడించారు.

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన పట్ల అల్లు అర్జున్ ప్రవర్తనకి సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో మండిపడ్డారు. బాధ్యతారహిత్యంగా ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అల్లు అర్జున్ జైలుకు వెళ్తే టాలీవుడ్ మొత్తం వెళ్లి అతడిని పలకరించింది అంతేకానీ తల్లిని కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాలుడిని పరామర్శించడానికి ఎవరు వెళ్లలేదంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకీపారేసారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇకపై సినిమాల టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని కూడా స్పష్టం చేశారు.