Ajay: ఎనిమిదవ వారంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన అజయ్.. ఆషూ గురించి ఎమోషనల్..!

Ajay: టెలివిజన్ లో ప్రసారమైన రియాలిటీ షోలలో మంచి గుర్తింపు పొందిన రియాలిటీ షో బిగ్ బాస్.ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం ఓటీటీ లో 24 /7 నాన్ స్టాప్ గా ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, మహేష్ విట్టా, సరయు, ఆర్జే చైతూ, తేజస్వీ, స్రవంతి తదితరులు ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం 8 వ వారంలో జరిగిన నామినేషన్ లో అతి తక్కువ ఓటింగ్ తో వెనుకబడిన అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. అజయ్ ఎలిమినేట్ అయ్యాడని తెలియటంతో అఖిల్ , ఆషూ రెడ్డి చాలా బాధ పడ్డారు. ఆషురెడ్డి మాత్రం అజయ్ ఎలిమినేట అవ్వటంతో తనని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అజయ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చి స్టేజ్ మీదకు వెళ్లగానే నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. దానిలో భాగంగా ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరికి ఫుల్ హార్ట్ సింబల్ , ఎవరికి బ్రోకెన్ హార్ట్ సింబల్ ఇస్తావు అని నాగార్జున అడగగా.. అజయ్ మాట్లాడుతూ బిందు మాధవి, అఖిల్, ఆషూ రెడ్డి, నట్రాజ్ మాస్టర్, మిత్ర శర్మ కు ఫుల్ హార్ట్ సింబల్ ఇవ్వగా .. మిగిలిన వారికి బ్రోకెన్ హార్ట్ సింబల్ ఇచ్చాడు.

ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ గురించి మాట్లాడుతూ కొంచెం స్ట్రాంగ్ ఉండు. ఆషూ అసలే పిచ్చిది. దాన్ని బాగా చుసుకో అని చెప్పాడు. ఇక ఆశు రెడ్డి గురించి మాట్లాడుతూ నీకు బ్రెయిన్ ఎలాగో లేదు..కనీసం హార్ట్ అయినా వాడు.రోజు స్నానం చెయ్యి. నేనైతే భరించాను కానీ.. మిగిలిన వాళ్ళు దాన్ని భరించలేరు చెప్పాడు. ఇలా నట్రాజ్ మాస్టర్, మిత్ర గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే మిగిలిన కంటెస్టెంట్ లకు బ్రోకెన్ హార్ట్ ఇవ్వటానికి గల కారణాలు గురించి కూడా అజయ్ వివరించాడు.