జూ.ఎన్టీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌ పాత్రతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు తారక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. నెట్టింటి ఈ వార్త వైరల్‌ అవుతోంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘డెడికేషన్‌ కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు.

తెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ ఇనస్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. తారక్‌తోపాటు మరో నలుగురు హాలీవుడ్‌ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది.

దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్‌కు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’లో చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొదటి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలనగా కనిపించనున్నారు. దీనితో పాటు హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే!