Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రతినెల సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఏ నెలలో ఎక్కువగా ఎవరి గురించి చర్చలు జరపారనే విషయంపై ప్రతి నెల సర్వేలు విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ఆగస్టు నెలలో ఎక్కువగా చర్చలు జరిగిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉండటం విశేషం. ఇక ఈయన దేశ ప్రధాని కావడంతో ఆయన గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగి ఉంటాయి. అందులో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు కానీ రెండో స్థానంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నిలవడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
ఇలా ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలిచిన నేపథ్యంలో అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన ఆగస్టు నెలలో వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి పెద్ద ఎత్తున ట్విట్టర్లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇలా మోడీ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ పేరు నిలవడం అంటే మామూలు విషయం కాదు దీన్ని బట్టి చూస్తుంటేనే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది. ఇక మూడో జాబితాలో విజయ్ దళపతి, నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్, ఐదో స్థానంలో శుభమన్ గిల్ ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ పేరు రెండో స్థానంలో రావడంతో తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
