Jr.NTR: నారా భువనేశ్వరికి ఒక న్యాయం… ఎన్టీఆర్ తల్లికి ఒక న్యాయమా?ఎందుకీ మౌనం?

Jr .NTR: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈయన ఫోన్ కాల్ సంభాషణ ద్వారా ఎన్టీఆర్ పై అలాగే ఆయన తల్లి శాలిని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడమే కాకుండా ఆయన ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అలాగే నాలుగు గోడల మధ్య కాదు దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ వివాదం గురించి ఎన్టీఆర్ అభిమానులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. గతంలో వైసిపి నేతలు నారా భువనేశ్వరుని అవమానకరంగా మాట్లాడారు అంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఇతర నాయకులు కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. మరి ఇప్పుడు ఎందుకని ఎన్టీఆర్ తల్లి విషయంలో తెలుగుదేశం పార్టీ అలాగే నందమూరి కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందిస్తూ వెంటనే ఎమ్మెల్యేని దగ్గుపాటి ప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇలా ఎన్టీఆర్ తల్లి గురించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతోనే అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఎమ్మెల్యే స్పందించారు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు ఉద్దేశం పూర్వకంగానే కుట్ర చేశారని అయినప్పటికీ తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఒక వీడియో విడుదల చేశారు. నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెప్పడం కాదు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.