Allu Arjun: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో చేయడం హిట్ కొట్టడం అన్నది కామన్. ఇలాంటి ఘటనలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. కొన్ని కొన్ని సార్లు ఇలా హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు మరొక హీరో చేసినప్పుడు అవి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంతమంది చేసి ఉంటే బాగుండు, చేయకపోయి మంచి పని అయింది అనుకుంటూ ఉంటారు. ఇకపోతే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాను జూనియర్ ఎన్టీఆర్ చేసి హిట్టు కొట్టారట.
ఇంతకీ ఆ సినిమా ఏది ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయాడు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత ఒక స్టార్ డైరెక్టర్ తో తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అల్లు అర్జున్ 21వ సినిమాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే కూడా సిద్దమైంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
కట్ చేస్తే అదే స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీని ప్రకటించాడు. అర్జున్ సినిమాకు అనుకున్న నిర్మాతలనే తారక్ సినిమాకి కూడా సెట్ చేశాడు. కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు మరో పాన్ ఇండియా హిట్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆ సినిమా మరేదో కాదు దేవర. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన కొరటాల శివ ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు. దీని తర్వాత దేవరతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఈ మధ్యలోనే అల్లు అర్జున్ తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు శివ. అలాగే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకో గానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ మూవీ కథతోనే కొరటాల శివ దేవర సినిమాను తీశాడని అంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ దేవర సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. ఒకవేళ అల్లు అర్జున్ దేవర మూవీ గనుక చేసి ఉంటే బన్నీ రేంజ్ మరింత పెరిగేది అని చెప్పాలి.
Allu Arjun- Jr NTR: బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఆ సినిమా ఏదో తెలుసా?
