మొదటి శుభలేఖ ఎవరికి ఇవ్వాలి… ఎవరికి ఇస్తే మంచి జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ కనుక వస్తే ఒకేసారి ఒకే ముహూర్తానికి రెండు మూడు పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఇలా పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున కళ్యాణమంటపాలన్నీ కూడా ఎంతో బిజీగా ఉండిపోయి ఎంతోమంది వధూవరులు ఒక్కటే అవుతూ ఉంటారు. ఇలా పెళ్లి వేడుకను మన సాంప్రదాయాల ప్రకారం ఎంతో పద్ధతిగా ఆచరిస్తూ ఉంటారు. ఇలా పెళ్లికి మొదటి అడుగు పెళ్లి శుభలేఖ.మన ఇంట్లో పెళ్లి జరుగుతుందని నలుగురికి తెలియడం కోసం శుభలేఖలు అచ్చు వేయించి పెళ్లికి చుట్టాలను సన్నిహితులను ఆహ్వానిస్తూ ఉంటాము.

పెళ్లికి అచ్చు వేయించిన ఈ శుభలేఖలను ముందుగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే మంచి జరుగుతుంది, పెళ్లి శుభలేఖలను ఏ దేవుడి వద్ద ముందుగా ఉంచాలి అనే విషయానికి వస్తే…అచ్చు వేయించిన తర్వాత వాటికి పసుపు కుంకుమ పెట్టి అనంతరం కాస్త అక్షంతలు వేయాలి ఇలా పెళ్లి శుభలేఖలు తయారైన తర్వాతఆ శుభలేఖను మీ ఇంటి దైవం ఏ దేవుడైన కానీ ముందుగా విజ్ఞాలను తొలగించి మనం చేసే కార్యంలో ఏ ఆటంకాలను కలిగించకుండా ఉండడం కోసం వినాయకుడు ముందు ఉంచి పూజ చేయాలి.

ఇలా పూజ చేసిన అనంతరం తర్వాత శుభలేఖలను వధూవరులు తాతయ్య దంపతులకు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి.ఇలా పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఈ శుభలేఖలను తర్వాత బంధువులకు సన్నిహితులకు పంచడం జరుగుతుంది.అయితే మొదటి శుభలేఖను వినాయకుడు ముందు ఉంచి తప్పనిసరిగా పూజ చేయడం వల్ల మనం చేసే ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా పెళ్లి కార్యక్రమం ఎంతో నిర్విఘ్నంగా కొనసాగుతుందని పండితులకు తెలియజేస్తున్నారు.