గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యకూడని తప్పులు ఇవే.. అలా చేస్తే మాత్రం నష్టమంటూ?

మనలో చాలామంది భక్తితో దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే గుడిని సందర్శించే సమయంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చెయ్యకూడదు. తీర్థం తీసుకునే వేళ కొన్ని తప్పులు చేస్తే మాత్రం నష్టపోక తప్పదు. దేవుడిని పూజించిన తర్వాత తీర్థం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. గుడికి వెళితే తీర్థం తప్పనిసరిగా తీసుకోవాలనే సంగతి తెలిసిందే.

తీర్థం తీసుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. ఎవరైతే తీర్థం తీసుకుంటారో వాళ్లు హస్త గోకర్ణ ముద్ర వేసి తీర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే శుభం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూజ చేసిన తర్వాత తీర్థం తీసుకుంటే మంచిది. రోజుకు మూడుసార్లు తీర్థం తీసుకుంటే మంచిది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్లు మరోసారి మరుసటి రోజు ఉదయం తీర్థం తీసుకోవాలి.

సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సమయంలో మాత్రం పూజ పూర్తైన వెంటనే తీర్థం తీసుకోకూడదు. సత్యనారాయణ కథ వినడానికి ముందు తీర్థం తీసుకుంటే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. తీర్థాలలో జల తీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం ఉండగా ఒక్కో సందర్భంలో ఒక్కో తీర్థం పొందే అవకాశం ఉంటుంది.

జల తీర్థం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మరణం సంభవించకుండా ఉంటుంది. సకల పాపాలను తొలగించి శుభ ఫలితాలను కల్గించడంలో జల తీర్థం ఉపయోగపడుతుంది. కషాయ తీర్థం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తీర్థం తీసుకునే సమయంలో శబ్దం రాకుండా తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థాన్ని తలపై రాసుకుంటే మంచిది.