పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుందా… శని దోష పరిష్కార మార్గాలు ఏంటో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను వారు చేసే కర్మలకు తగ్గ ఫలితాలను శని దేవుడు వారికి అందిస్తారని విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా శని దేవుని ప్రభావం మనపై ఉండటం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని ప్రభావం మనపై ఉన్నప్పుడు ఎక్కువగా ఇతరులతో అవమానాలు పడటం లేదా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం అలాగే అనుకున్న పనులు సరైన సమయంలో జరగకపోవడం వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి.

ఇలా పెద్దవారిలో శనీశ్వరుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఇబ్బందులకు కొరిచేస్తుంటారు అయితే చిన్న పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుందా అనే విషయానికొస్తే తప్పకుండా చిన్న పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుంది అయితే చిన్నపిల్లలకు ఊహ తెలిసిన తర్వాత శని ప్రభావం వారికి ఉంటుంది కానీ ఊహ తెలియని వయసులో శని ప్రభావం పిల్లలపై ఉంటే ఆ ప్రభావం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. అందుకే పిల్లలపై ఉన్నటువంటి ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే ఒకటే పరిష్కార మార్గం ఉందని చెప్పాలి.

పిల్లలపై శని ప్రభావం ఉన్నప్పుడు పిల్లలలో ఏకాగ్రత లేకపోవడం చదువులో వెనుకబడటం వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి ఇలాటి లక్షణాలు కనుక ఉంటే వారిపై శని అనుగ్రహం పడినట్టనే అర్థం. ఇక శనీశ్వరుడు ప్రభావం నుంచి బయటపడాలి అంటే కేవలం శనివారం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసే అభిషేకం నిర్వహించడమే ఇందుకు పరిష్కార మార్గం. శివుడికి పూజ చేయడం లేదా శివస్త్రం పటించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పిల్లల తరఫున తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేయించిన అర్చన చేయించిన అదే ఫలితాలు పొందుతారు.. శని ఉన్నప్పుడు పదే ఆ మాట అనడం వల్ల శని ప్రభావం రెట్టింపయ్య సూచనలు ఉంటాయి.