కొన్ని సినిమాలు ఏ మాత్రం హడావుడి లేకుండా స్టార్ట్ అయ్యి షూటింగ్ పూర్తయిన తరవాత , పబ్లిసిటీ కొచ్చేసరికి వినూత్న ఒరవడి సృష్టిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసే సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ కోవలోకి చెందిన సినిమానే “లోపలికి రా చెప్తా”. పబ్లిసిటీ పరంగా నూతన ఒరవడి సృష్టిస్తున్న కాన్సెప్ట్ బెసిడ్ మూవీ “లోపలికి రా చెప్తా”.
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రటీజర్ ను ప్రముఖ యాంకర్ అంజలి నేడు ఆవిష్కరించారు. తొలి సారి ఓ ఫిమేల్ యాంకర్ టీజర్ ఆవిష్కరించడం విశేషం.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ“లోపలికి వస్తే చెప్తా సాంప్రదాయబద్ధమైన టీజర్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఇది భార్యాభర్తలు కలసి చూడవలసిన సినిమా. ఈ సినిమా యూత్ తో పాటు సకుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుందని మీకు మాటిస్తున్నాను అని అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ” మంచి మనసుతో సీనియర్ జర్నలిస్టు అంజలి గారు మా టీజర్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని చెప్తూ,అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా తమ “లోపలికి రా చెప్తా” సినిమా ఉంటుందని, త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నామని, సినిమాను ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
నటీనటులు – కొండా వెంకట రాజేంద్ర ,మనీషా జష్ణాని , సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి ,వాణి ఐడా, తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్: డేవ్ జాండ్
డీవోపీ: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్
ఎడిటర్: వంశీ
పీఆర్ఓ : బి. వీరబాబు
ప్రొడ్యూసర్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర
కథ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర