ఈ దిక్కున ఇల్లు ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట.. ఆ లాభాలు కూడా పొందవచ్చంటూ?

మనలో చాలామంది భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. కొంతమంది ఆ కలలను సులువుగానే నిజం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంటి వాస్తును బట్టి కూడా కొన్నిసార్లు మనకు లక్ష్మీ కటాక్షం ఉండటం జరుగుతుంది. పడమర దిక్కున ఇల్లు ఉంటే లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. తలుపులు, కిటికీల విషయంలో కూడా వాస్తును పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

వాస్తు ప్రకారం గదులను నిర్మించడం వల్ల దేవుని అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు. ఏ గదికి ఆ గదిని నిర్మించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు సైతం తక్కువగా ఉంటాయి. స్థలం కొనుగోలు చేసే సమయంలోనే ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఇష్టానుసారం ఇంటిని నిర్మిస్తే మాత్రం తర్వాత రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు.

ప్రతిరోజూ ఇంట్లో లక్ష్మీ దేవత పటాన్ని పెట్టుకుని పూజిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో వాస్తు నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది. లక్ష్మీదేవిని ప్రతిరోజూ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోయినా, వస్తువులను పెట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా చెడు ఫలితాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

దేవుడిని మనస్పూర్తిగా నమ్మి పూజలు చేస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాళ్లు ఇంటిని కొంచెం పెద్దగా నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ప్రతిరోజూ పూజిస్తారో వాళ్లకు శుభ ఫలితాలు కలుగుతాయి.