శరీరంలో వేడి పెరగడానికి కారణాలివే.. వేడిని సులువుగా తగ్గించే అద్భుతమైన ఆహారాలివే!

శరీరంలో వేడి పెరగడం వల్ల మనలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య బారిన పడిన వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల లేదా ఎక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మహిళలకు మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

కొన్ని మందుల వాడకం వల్ల కూడా శరీరంలో వేడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కారం ఎక్కువగా ఉన్న వంటకాలను తినడం వల్ల కూడా శరీరంలో కొన్నిసార్లు వేడి పెరుగుతుంది. హృదయం వేగంగా కొట్టుకోవడం, అల్సర్, అజీర్ణం, మలబద్ధకం, నిద్రలేమి, అసిడిటీ, కళ్లలో మంట మరికొన్ని లక్షణాలు శరీరంలో వేడి పెరిగిందని చెప్పడానికి సంకేతాలుగా ఉంటాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వేడి అదుపులో ఉంటుంది.

శరీరంలో వేడి సమస్యతో బాధ పడేవాళ్లకు కొబ్బరి నీళ్లు మంచి ఆప్షన్ అవుతుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు సహజంగా ఎలక్ట్రోలైట్ లను సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో మజ్జిగ కూడా ఎంతగానో సహాయపడుతుంది. వేడిగా ఉన్న సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

కలబంద జెల్ ను శరీరానికి అప్లై చేయడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించవచ్చు. నిమ్మ నీటిలో పుదీనా కలిపి తాగితే శరీరంలో వేడి అదుపులో ఉంటుంది. పుచ్చకాయను తీసుకోవడం ద్వారా శరీరం చల్లగా ఉంటుందని చెప్పవచ్చు. దోసకాయలు, చిన్న మిరపకాయలు, నిమ్మరసం, ఉల్లిపాయలు, సెలెరీ శరీరంలో వేడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.