Hombale Films: ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో రెండు సినిమాలతో చరిత్ర సృష్టించిన హోంబాలే ఫిల్మ్స్

Hombale Films: భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకుంది. 2025లో విడుదలై ఘన విజయం సాధించిన ‘మహావతార్ నరసింహ’, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలు అధికారికంగా ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి. ఇది భారతీయ సినిమాకు, హోంబాలే ఫిల్మ్స్‌కు గర్వకారణమైన క్షణం.

రిషబ్ శెట్టి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘కాంతారా: చాప్టర్ 1’, అలాగే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మహావతార్ నరసింహ’ (హోంబాలే ఫిల్మ్స్ ప్రెజెంటేషన్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా, అద్భుతమైన కథ, సాంస్కృతిక ప్రామాణికత, సాంకేతిక నైపుణ్యం, విజువల్ గ్రాండియర్‌కు విశేష ప్రశంసలు అందుకున్నాయి.

ఈ రెండు చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చేరడం ద్వారా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే/రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన విభాగాల్లో అకాడమీ పరిశీలనకు అర్హత సాధించాయి.

ముఖ్యంగా, ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ సినిమాల్లో రెండు హోంబాలే ఫిల్మ్స్‌వే కావడం విశేషం.

పవర్ ఫుల్ కథలకు అండగా నిలవడం, క్రియేటివ్ బౌండరీస్ దాటడం, భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం..ఇవన్నీ హోంబాలే ఫిల్మ్స్ ప్రయాణంలో మరోసారి రుజువయ్యాయి.

భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సాధిస్తున్న ఈ సమయంలో, హోంబాలే ఫిల్మ్స్ సాధించిన ఈ ఘనత భారతీయ సినీ పరిశ్రమ క్రియేటివ్ పవర్ కి ప్రతీకగా నిలుస్తుంది.

హోంబాలే ఫిల్మ్స్‌కు, భారతీయ సినిమాకు ఇది గర్వించదగ్గ క్షణం.

రాజాసాబ్ కలెక్షన్స్| Raja Saab Box Office Collection Explained By Journalist Bharadwaj | Prabhas |TR