Om Shanti Shanti Shantihi: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ హార్ట్ టచ్చింగ్ థీమ్ సాంగ్ రిలీజ్

Om Shanti Shanti Shantihi: ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ.

ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ సిన్నారి కోన సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు సెకండ్ సింగిల్ ఓం శాంతి శాంతి శాంతిః థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి మహిళకు అంకితంగా నిలిచే ఈ పాటని జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్‌పుర్కర్ వోకల్స్ మరింత ఎమోషన్ ని యాడ్ చేశాయి.

భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి పదం మనసుని హత్తుకొని సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేశాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తోంది.

ఈ చిత్రానికి దీపక్ డీవోపీగా పని చేస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్స్ రాస్తున్నారు.

ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – ఎ ఆర్ సజీవ్
నిర్మాతలు – సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
బ్యానర్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్ స్టూడియోస్
సహ నిర్మాతలు: కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
సంగీతం – జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – దీపక్ యెరగరా
డైలాగ్స్ – నంద కిషోర్ ఈమాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -భువన్ సాలూరు
లైన్ ప్రొడ్యూసర్ – శ్రీనివాసరావు ఈర్ల
PRO – వంశీ-శేఖర్

చంద్రబాబు పరువు తీసిన జగన్ || YS Jagan Strong Counter To Chandrababu || Revanth Reddy ||TeluguRajyam