WINClub: ప్రఖ్యాత తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం “ఈటీవీ విన్”, యువత మరియు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, పెంపొందించడానికి “విన్.క్లబ్” ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, అకడమిక్ చదువు మరియు పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, “ఈటీవీ విన్ – చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)” లోని ఛాయా క్లబ్ తో కలిసి క్యాంపస్లో “విన్.క్లబ్” ను ప్రారంభించింది. ఛాయా క్లబ్ లోని సృజనాత్మక వాతావరణం మరియు ఈటీవీ విన్ యొక్క మీడియా & ఎంటర్టైన్మెంట్ రంగ అనుభవం కలసి, విద్యార్థులకు కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, స్టోరీ టెల్లింగ్, మీడియా వంటి రంగాల్లో ప్రాక్టికల్ అవగాహన అందించనున్నాయి.
“విన్.క్లబ్” ద్వారా విద్యార్థులు వర్క్ షాప్స్ , ఇంటరాక్టివ్ సెషన్స్, ఇండస్ట్రీ నిపుణులతో ఇంటరాక్షన్స్ మరియు తమ ప్రతిభను విస్తృత వేదికపై ప్రదర్శించే అవకాశాలను పొందుతారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఒరిజినాలిటీ మరియు ఇన్నోవేషన్స్ ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
CBITతో ప్రారంభమైన ఈ ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు ఇతర కాలేజీలు కూడా ఇప్పటికే పైప్లైన్లో ఉన్నాయి, తద్వారా మరింత మంది యువతకు ఈ అవకాశాన్ని అందించేందుకు ఈటీవీ విన్ కృషి చేస్తోంది.
“విన్.క్లబ్” ద్వారా, రేపటి కథకులు, దర్శకులు మరియు మార్పు తీసుకొచ్చే యువతను తీర్చిదిద్దాలనే తన కట్టుబాటును “ఈటీవీ విన్” మరోసారి చాటుతోంది.
MOU ఎక్చేంజ్ కార్యక్రమం లో ETV విన్ హెడ్ శ్రీ సాయి కృష్ణ కొయిన్నీ, మార్కెటింగ్ హెడ్ శ్రీ యువకాంత్ బందారి, మరియు విన్.క్లబ్ సమన్వయకర్త వి. దివ్య దర్శిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ స్టార్ట్-అప్ మరియు క్లబ్ స్థాపకుడు శ్రీ శ్రీనివాస్ అండోజు సమన్వయం చేశారు. కార్యక్రమానికి చురుకైన సహకారం మరియు ప్రోత్సాహం అందించిన CBIT యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, ప్రిన్సిపాల్ డా. సి.వి. నరసింహులు, డైరెక్టర్ – స్టూడెంట్ అఫైర్స్ అండ్ ప్రోగ్రెషన్ బి. లింగారెడ్డి, డైరెక్టర్ – ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ సెల్ డా. యు. ఉమాకాంత్ చౌదరి, వైస్-ప్రిన్సిపాల్ డా. రవీందర్ రెడ్డి, ఆంగ్ల విభాగాధిపతిరాలు డా. షగుఫ్తా పర్వీన్, మరియు ఇతర అధ్యాపకుల సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.

