అరటి పండ్లను కొన్ని ఆహార పదార్ధాలతో కలిపి తినడం మంచిది కాదు. ముఖ్యంగా పాలు, పెరుగు, సిట్రస్ పండ్లు (నిమ్మ, దానిమ్మ), స్వీట్లు, బంగాళాదుంపలు మరియు శీతల పానీయాలు వంటి ఆహారాలను అరటి పండ్లతో కలిపి తినకపోవడమే మంచిది. ఇవి జీర్ణక్రియలో అసౌకర్యాన్ని సృష్టించవచ్చు. అరటిపండు తిన్న తర్వాత పాలు లేదా పెరుగు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
నిమ్మ, దానిమ్మ వంటి ఆమ్ల స్వభావం ఉన్న పండ్లను అరటి పండుతో కలిపి తింటే వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అరటి పండును హల్వా, బర్ఫీ వంటి స్వీట్లతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే అరటి పండులో అధికంగా చక్కెర ఉంటుంది, అలాగే స్వీట్లలో కూడా చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బంగాళాదుంపలు, అరటిపండ్లు రెండూ కార్బోహైడ్రేట్లకు అధికంగా ఉంటాయి కాబట్టి కలిపి తినడం వల్ల జీర్ణక్రియలో అసౌకర్యం కలుగుతుంది.
శీతల పానీయాలు మరియు అరటిపండ్లు కలిపి తింటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కారంగా ఉండే ఆహారాలు మరియు అరటిపండ్లు కలిపి తింటే గ్యాస్, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు రావచ్చు. అరటిపండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ పండ్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అరటి పండ్లు తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
అరటి పండ్లు తినడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయని చెప్పవచ్చు. అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో ఆకలిని నియంత్రించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అరటి పండును వేయించిన ఆహారాలతో తినడం మానుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ మీ జీర్ణ శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది. కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడతారు.