Vishnu Vinyasam: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.
తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఫస్ట్ సింగిల్ ‘దేఖో విష్ణు విన్యాసం’ను విడుదల చేశారు. ఈ సరదా పాట కథానాయకుడికి జ్యోతిష్యంపై ఉన్న పిచ్చిని ప్రజెంట్ చేస్తోంది. ప్రతి బీట్, ప్రతి పదం, ప్రతి ఎక్స్ ప్రెషన్ విష్ణు పాత్ర జాతకాలను జీవితానికి మార్గదర్శకంగా ఎలా భావిస్తుందో తెలియజేస్తాయి. రధన్ అందించిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యం, శ్రీకృష్ణ పవర్ ఫుల్ వోకల్స్ ఈ పాటను మూఢనమ్మకాలపై ఒక సరదా వేడుకగా మార్చాయి.
నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ. రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి ఎడిటర్
చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్

