By-elections: ఏపీలో ఆ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము ఎవరికుంది..?

By-elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అనే టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చి, అత్యంత చర్చనీయాంశంగా మారుతూ.. కూటమి ప్రభుత్వానికున్న దమ్ము గురించిన చర్చకు తెరలేపినట్లు తెలుస్తోంది! దీంతో.. అదే జరిగితే ఈ ఆరు స్థానాల వేడి, ఫలితాల ప్రభావం మిగిలిన 169 నియోజకవర్గాలపైనా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఏపీలో అసెంబ్లీకి గౌర్హాజరువుతున్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో సుమారు ఆరుగురు సంతకాలు పెట్టి, వెళ్లిపోతున్నారని అంటున్న విషయాన్ని స్పీకర్ ఏ మేరకు సీరియస్ గా తీసుకోగలరు..?

పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కేవలం మాటలకే పరిమితం అవుతుందా.. లేక, చేతలకు ఏమైనా ఛాన్స్ ఉందా..?

నిజంగా అసెంబ్లీకి వచ్చి, సభకు హాజరుకాకుండా సంతకాలు చేసి వెళ్లిపోతున్నట్లు చెబుతున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేస్తే… ఉప ఎన్నికకు వెళ్లే ఆలోచన, సాహసం కూటమి ప్రభుత్వం చేయగలదా..?

వాస్తవానికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన కూటమి ప్రభుత్వం.. ప్రజల్లో తమకు 2024 ఎన్నికల నాడు ఉన్న నమ్మకం, మద్దతూ ఇప్పుడూ ఉంది అని చెప్పుకునే అవకాశం వచ్చిందని ముందుకు కదిలే పరిస్థితి ఉంటుందా..?

నిజంగా కూటమి ప్రభుత్వం ఆ సాహసం చేస్తే… ఆ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉన్నాయా..?

జగన్‌ అయినా.. మరే ఎమ్మెల్యే అయినా.. సహేతుక కారణంతో సెలవు దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే.. వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని గత ఏడాది ఫిబ్రవరిలోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు ఆరుగురు దాకా ఉంటారని.. వారికి నోటీసులు జారీ చేసి ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరు కావాలని కోరుతారని అంటున్న వేళ.. స్పీకర్ ఈ వ్యవహారంపై యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటే.. ఆ ఆరు స్థానాల్లోనూ ఉప ఎన్నికలు రావాల్సి ఉంటుంది!

అదే జరిగితే స్థానిక ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఓ మినీ ఎన్నికల సమరం మొదలవుతుందని అంటున్నారు. తెలంగాణాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నికలు జరిగితేనే భారీ హీట్ నెలకొన్న వేళ.. ఏపీలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అంటే అది ఏ షాయిలో పొలిటికల్ హీట్ సృష్టిస్తుందనేది ఊహించుకోవచ్చని అంటున్నారు. ఈ సమయంలో సభాపతి నిర్ణయం.. అనధికారికంగా చెప్పుకోవాలంటే అందుకు అధికార పార్టీ ధైర్యంపై ఏపీలో ఉప ఎన్నికలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో… ఉప ఎన్నికకు అవకాశం వస్తే అందుకు వైసీపీ పూర్తి సిద్ధంగా ఉందనే చర్చా తెరపైకి వచ్చింది! అందుకు గల కారణాలు చాలా ఉన్నాయనేది వినిపిస్తున్న రీజన్. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా వరకూ గాలికి వదిలేశారని.. రైతులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగ భృతి పేరు చెప్పి యువతను, మహిళలను, పీపీపీ పేరు చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబడుతుండటం వంటి సవాలక్ష సమస్యలు ఉన్నాయని.. ప్రభుత్వ వ్యతిరేకతపై ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి.. ఏపీలో ఉప ఎన్నికలు వస్తే తాము 100% సిద్ధంగా ఉన్నామని.. మిగిలినవారిదే ఆలస్యమని బరిలోకి దిగి తొడలు కొడుతున్నారు వైసీపీ నేతలు అనే కామెంట్లూ వినిపిస్తున్న పరిస్థితి అని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది వేచి చూడాలి.

Raja Saab Movie Genuine Public Talk || Prabhas || Maruthi || Raja Saab Review || #RajaSaabTalk || TR