Purushaha: ఆసక్తికరంగా ‘పురుష:’ టీజర్.. ఒక్కో షాట్ ఒక్కో ఆణిముత్యం అంతే..!

Purushaha: భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇక అందులో కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. అలాంటి ఫ్యామిలీ కథతో వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే సినిమా రాబోతోంది. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారు.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా.. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు హీరోల పాత్రలు, వారి బిహేవియర్, పాత్రల తీరుకి తగ్గట్టుగా పరిచయం చేసిన పోస్టర్లు అందరినీ నవ్వించేశాయి. అలాగే హీరోయిన్ల పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా పోస్టర్లను విడుదల చేస్తూ అందరి దృష్టి ఈ సినిమా పై పడేలా చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ‘పురుష:’ టీజర్ వదిలారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన బుచ్చిబాబు సానా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. అలాగే చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

టీజర్ విషయానికొస్తే.. ప్రతి సీన్ లో కామెడీ టచ్ ఉండేలా చూసుకున్నారు. ఏ దినము చూసినా షాపింగ్.. షాపింగ్.. షాపింగ్.. అది మా దినముకి వచ్చుచున్నది అంటూ సప్తగిరి చెప్పిన డైలాగ్ నేటితరం భార్యాభర్తల తీరును చెప్పేలా ఉంది. మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు.. అని పేర్కొంటూ టీజర్ ముగించారు. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అని ఈ వీడియో ద్వారా తెలిపారు. పెళ్లి, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే కోణంలో కామెడీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతోంది. టీజర్ లోని కొన్ని సీన్లయితే ఓ వర్గం ఆడియన్స్‌కి సినిమాపై క్యూరియాసిటీ పెంచాయనే చెప్పుకోవచ్చు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. చిత్రంలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్

సర్కార్ విషం || Nalamotu Chakravarthy On Fake Alcohol In AP | Chandrababu || Telugu Rajyam